BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?
''ఎలాంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో మెట్రో కారిడార్లు విస్తరించేందుకు వీలుంటుంది. అన్ని ఫేజ్‌ల పరంగా ఒకే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా, నిర్వహణ పరంగా మరింత సమర్థంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది'' అని మెట్రో మొదటి దశ స్వాధీనం అగ్రిమెంట్ పూర్తయ్యాక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
డిజిటల్ మోసాల్లో రూ. 23,750 కోట్లు కోల్పోయిన భారతీయులు
ఈ రకమైన మోసాన్ని నిపుణులు ''సోషల్ ఇంజనీరింగ్'' స్కామ్ అని పిలుస్తున్నారు. బాధితుల మానసిక స్థితిని మానిపులేట్ చేసి, వారిలో భయాన్ని, ఆత్రుతను పెంచి స్కామర్లు వారిని దోచుకుంటున్నారు. గత ఐదేళ్లుగా దేశంలో డిజిటల్ చెల్లింపులు అనూహ్యమైన రీతిలో పెరగడంతో ఈ రకమైన మోసాలు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నాయి.
ఊటీ అడవుల్లో భారీ కార్చిచ్చు, వేల ఎకరాల్లో మంటలు
పశ్చిమ కనుమల్లోని నీలగిరి జిల్లా అటవీ ప్రాంతాల్లో రెండు వారాలుగా భారీగా మంటలు చెలరేగాయి. ఊటీకి సమీపంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఒకేసారి 10 ప్రాంతాల్లో మంటలు చెలరేగడం వెనుక ఏదైనా కుట్రకోణముందా?
వీడియో, ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనాభా లెక్కల్లో ఎక్కడ నమోదు చేసుకోవాలి?, వ్యవధి 2,37
చాలామంది తల్లిదండ్రులు సొంతూళ్లో, పిల్లలు వేరే ఊళ్లో ఉద్యోగాల్లో ఉంటారు. ఇలాంటప్పుడు జనగణనలో ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?
ఒపెక్ నుంచి యూఏఈ తప్పుకోవడం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 91 శాతం దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు, ఇది సానుకూల అంశం కావచ్చని నిపుణులు ఎందుకు అంటున్నారు?
ట్యాబ్లెట్లలో వెజ్, నాన్ వెజ్ ఉంటాయా?
చాలా ట్యాబ్లెట్‌లలో (క్యాప్సూల్స్ కాకుండా) ఔషధాన్ని గట్టిగా ఉండేలా చేయడానికి సాధారణంగా మొక్కల ఆధారిత బైండర్లు, ఫిల్లర్లు వాడతారని హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసిస్ట్ స్వాతి ‘బీబీసీ’తో చెప్పారు.
మమత Vs బీజేపీ: పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌పై రాజకీయ నిపుణులు ఏమంటున్నారు?
"నేను ఇకపై ఎన్నికల విశ్లేషణ చెయ్యాలనుకోవడంలేదు, అందుకే మౌనంగా ఉన్నాను. కానీ ఈ సాయంత్రం పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఒక విషయం కచ్చితంగా చెప్పాల్సిందే. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే, ఈసారి టీఎంసీకి మెజారిటీ రాకపోవడమేమీ ఉండదు" అని ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు
మేక దొంగతనం.. 48 మంది ప్రాణాలను బలితీసుకుంది, అసలేం జరిగింది?
తొమ్మిదేళ్ల కిందట మేక దొంగతనంతో ఈ శత్రుత్వం మొదలైందని ఖుర్బాన్ తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ముగ్గురిని మేక యజమాని క్షమించారు, కానీ ఒక వ్యక్తిని క్షమించేందుకు నిరాకరించారు. ఆ తర్వాత పరిస్థితి చేయిదాటిపోయి సాయుధ ఘర్షణకు దారితీసింది. తర్వాత ఏమైంది?
పుతిన్ సన్నిహితుడి రూ.4,700 కోట్ల విలాసవంతమైన నౌక.. ఆంక్షలు ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధిని ఎలా దాటగలిగింది?
'సూపర్ యాట్ టైమ్స్' పత్రిక ప్రకారం, 'నార్డ్'లో స్విమ్మింగ్ పూల్, సబ్ మెరైన్, హెలిప్యాడ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. 2022లో రష్యా యుక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా పాశ్చాత్య దేశాలు మోర్దాషోవ్‌పై ఆంక్షలు విధించాయి. గతంలో పాశ్చాత్య దేశాలు విజ్ఞప్తి చేసినప్పటికీ హాంకాంగ్, మాల్దీవులు 'నార్డ్'ను స్వాధీనం చేసుకోవడానికి నిరాకరించాయి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































